Share News

Singapore and Malaysia: ముగిసిన మంత్రి నారాయణ విదేశీ పర్యటన

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:12 AM

ఏడు రోజుల పాటు సింగపూర్‌, మలేషియాలో మంత్రి నారాయణ పర్యటించి ఆదివారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు.

Singapore and Malaysia: ముగిసిన మంత్రి నారాయణ విదేశీ పర్యటన

అమరావతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఏడు రోజుల పాటు సింగపూర్‌, మలేషియాలో మంత్రి నారాయణ పర్యటించి ఆదివారం సాయంత్రం విజయవాడ చేరుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అనువైన పద్ధతులను మంత్రి బృందం అధ్యయనం చేసింది. భవన నిర్మాణాలు, రోడ్లు, మౌలికవసతులు, రోడ్డు రవాణా, కన్వెన్షన్‌ సెంటర్లు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌లు, పార్కులను మంత్రి బృందం పరిశీలించింది. సింగ్‌పూర్‌, మలేషియాల్లోని బెస్ట్‌ ప్రాక్టీస్‌ను అమరావతి నిర్మాణంలో ఉపయోగించే యోచన చేస్తున్నారు.

Updated Date - Aug 04 , 2025 | 05:20 AM