Vishwasamudra Engineering: మూలపేట పోర్టు పూర్తికి మరింత గడువివ్వండి
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:48 AM
తుఫాన్లు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మూలపేట (భావనపాడు) పోర్టును గడువులోగా...
కాంట్రాక్టు సంస్థ ‘విశ్వసముద్ర’ వినతి.. రాష్ట్రప్రభుత్వం అంగీకారం
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): తుఫాన్లు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మూలపేట (భావనపాడు) పోర్టును గడువులోగా పూర్తి చేయలేకపోయామని కాంట్రాక్టు సంస్థ విశ్వసముద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. తమకు మరో 409 రోజులు గడువిస్తే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి రాష్ట్రప్రభుత్వం అంగీకరిస్తూ 2026 నవంబరు 30నాటికి మూలపాడు పోర్టును పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. జాప్యం కారణంగా పెరిగిన అదనపు వ్యయాలను చెల్లించబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వు జారీ చేశారు.