Share News

మట్టి మాఫియా

ABN , Publish Date - Nov 27 , 2025 | 12:20 AM

మండలంలోని ఎర్ర మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రెవెన్యూ, పంచాయతీ అధికారుల అనుమతులు లేకున్నా.. ఎర్ర మట్టిని దర్జాగా పట్టపగలే తరలిస్తున్నారు.

మట్టి మాఫియా
మట్టిని తరలించడంతో ఏర్పడ్డ భారీ గుంత

విడపనకల్లు, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్ర మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రెవెన్యూ, పంచాయతీ అధికారుల అనుమతులు లేకున్నా.. ఎర్ర మట్టిని దర్జాగా పట్టపగలే తరలిస్తున్నారు. దొరికిన కాడికి దోచేస్తున్నారు. చీకలగురికి గ్రామ సమీపంలోని కొంత స్థలంలో శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటికకు ఆనుకొని చెరువు (నీటి గుంతలు) ఉన్నాయి. శ్మశానాన్ని చెరువుగా చూపించి ఎర్ర మట్టిని తరలిస్తున్నారు. ఉన్న ఆ కొంత శ్మశాన స్థలమూ పోతే.. అంత్యక్రియలు నిర్వహించడానికి ఇబ్బందులుపడాల్సి వస్తుందని ఆ గ్రామస్థులు వాపోతున్నారు. దీనిపై వీఆర్వో వెంకటేశను వివరణ కోరగా తాము ఎవ్వరికి అనుమతులు ఇవ్వలేదని అన్నారు.

Updated Date - Nov 27 , 2025 | 12:20 AM