Indian currency: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:42 AM
తెలుగు రాష్ట్రాల ఎంపీలు కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన సభలో పలువురు ఎంపీలు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాలంటే ఈ చర్య అవసరమని పేర్కొన్నారు.
తెలుగు ఎంపీల డిమాండ్.. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన
న్యూఢిల్లీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి అధ్యక్షుడు జెరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ధూంధాం సభకు టీడీపీ ఎంపీలు బీద మస్తాన్‌రావు, కలిశెట్టి అప్పలనాయుడు, బీజేపీ ఎంపీలు ఆర్.కృష్ణయ్య, ఈటల రాజేందర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించినప్పుడే రాజ్యాంగాన్ని గౌరవించినట్టు అవుతుందన్నారు. నాడు అంబేడ్కర్ లేకుంటే నేడు ఆర్బీఐ లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..