Share News

Temple Visit: అప్పన్న సన్నిధిలో ఎంపీ సుధా నారాయణమూర్తి

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:52 AM

రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌, మూర్తి ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ సుధా నారాయణమూర్తి శనివారం...

Temple Visit: అప్పన్న సన్నిధిలో ఎంపీ సుధా నారాయణమూర్తి

సింహాచలం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌, మూర్తి ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ సుధా నారాయణమూర్తి శనివారం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆమెకు దేవస్థానం ఈఓ ఎన్‌.సుజాత, అర్చకులు అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ఆమె గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు స్వామివారికి పూజలు చేశారు. పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలీయగా, ఈఓ శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

Updated Date - Dec 14 , 2025 | 04:53 AM