Share News

MP Sri Bharat: రాష్ట్రానికి పెట్టుబడులు వైసీపీకి ఇష్టం లేదు

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:37 AM

రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ ఆరోపించారు.

MP Sri Bharat: రాష్ట్రానికి పెట్టుబడులు వైసీపీకి ఇష్టం లేదు

  • పారిశ్రామిక సదస్సులో 401 ఒప్పందాలు,9.8 లక్షల కోట్ల పెట్టుబడులు: ఎంపీ శ్రీభరత్‌

విశాఖపట్నం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకి ఇష్టం లేదని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ ఆరోపించారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీలో మార్పు రాలేదు. వారికి చిత్తశుద్ధి ఉంటే రుషికొండపై ప్యాలెస్‌ నిర్మాణానికి చేసిన ఖర్చుతో ఉత్తరాంధ్రలో వైద్య కళాశాలలు పూర్తి చేసి ఉండేవారు. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న పెట్టుబడిదారుల సదస్సులో సుమారు 401 ఒప్పందాలు జరుగుతాయి. వాటి ద్వారా రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం’ అని ఎంపీ శ్రీభరత్‌ తెలిపారు.

Updated Date - Nov 11 , 2025 | 06:37 AM