దళితులను వేధించిన జగన్: ఎంపీ ప్రసాదరావు
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:41 AM
దళితులను వేధించడమే పనిగా జగన్ ఐదేళ్ల పాలన సాగించారని చిత్తూరు ఎంపీ ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని ..
మడకశిరలో ఘనంగా విగ్రహాల ఆవిష్కరణ
మడకశిర, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): దళితులను వేధించడమే పనిగా జగన్ ఐదేళ్ల పాలన సాగించారని చిత్తూరు ఎంపీ ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని బేగార్లపల్లిలో బాబూజగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఆవిష్కరణ సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 15 మంది దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో చట్టాలను తుంగలోకి తొక్కారని, దళితులను అవమానించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బాబూ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తి, అంబేడ్కర్ ఆశయ సాధనలో భాగంగా ఉద్భవించిందని తెలిపారు. ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భారతదేశ తలరాతను మార్చింది బాబూ జగ్జీవన్‌రామ్ అనీ, ప్రపంచ దేశాల్లోకి ఉన్నత రాజ్యాంగాన్ని రచించి అందించిన మహానుభావుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారధి, ఎమ్యెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీధర్, కుమార రాజవర్ల, విజయచంద్ర, మురళీమోహన్, రోషన్, దస్తగిరి, జయసూర్య, విజయశ్రీ, ఎమ్మెల్సీ గ్రీష్మ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిప్పేస్వామి పాల్గొన్నారు.