MP Mithun Reddy: కోర్టుకు పాస్‌పోర్టు అప్పగించిన మిథున్‌రెడ్డి
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:30 AM
మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తన పాస్‌పోర్టును విజయవాడలోని ఏసీబీ కోర్టుకు అప్పగించారు...
విజయవాడ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తన పాస్‌పోర్టును విజయవాడలోని ఏసీబీ కోర్టుకు అప్పగించారు. కేంద్రంతరఫున ఎంపీల బృందంలో తాను అమెరికాకు వెళ్లాల్సి ఉన్నందున తన పాస్‌పోర్టును ఇప్పించాలని కోరుతూ మిథున్‌రెడ్డి ఇటీవల పిటిషన్ వేయడంతో ఆయన పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది. పర్యటన ముగిసిన తర్వాత పాస్‌పోర్టును కోర్టులో అప్పగించాలని ఆ సందర్భంగా కోర్టు ఆదేశించింది. దీంతో ఆయన తరఫున న్యాయవాదులు బుధవారం పాస్‌పోర్టును కోర్టులో అప్పగించారు.