Share News

MP Mithun Reddy: 2వ తేదీన సిట్‌ ఆఫీస్‌కు వెళ్లలేను

ABN , Publish Date - Dec 31 , 2025 | 04:39 AM

ప్రతి శుక్రవారం సిట్‌ కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉన్న నేపథ్యంలో రెండో తేదీన సంతకానికి వెళ్లలేనని, దానికి అనుమతించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో...

MP Mithun Reddy: 2వ తేదీన సిట్‌ ఆఫీస్‌కు వెళ్లలేను

  • ఏసీబీ కోర్టులో మిథున్‌రెడ్డి పిటిషన్‌

విజయవాడ, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రతి శుక్రవారం సిట్‌ కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉన్న నేపథ్యంలో రెండో తేదీన సంతకానికి వెళ్లలేనని, దానికి అనుమతించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి మంగళవారం పిటిషన్‌ వేశారు. మద్యం కుంభకోణంలో మిథున్‌రెడ్డికి బెయిల్‌ను మంజూరు చేసే సమయంలో కోర్టు షరతులు విధించింది. దీని ప్రకారం ప్రతి శుక్రవారం ఆయన సిట్‌ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలి. వచ్చే శుక్రవారం వెళ్లలేనని పిటిషన్‌లో మిథున్‌రెడ్డి తెలిపారు. విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Updated Date - Dec 31 , 2025 | 04:40 AM