జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:28 AM
వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు పట్ల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు పట్ల చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు ఉన్న ప్రజాదరణను ఓర్వలేక రోత వ్యాఖ్యలు చేయడం వైఎస్ జగన్‌కే చెల్లిందని విమర్శించారు. శుక్రవారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అనంతపురంలో నిర్వహించిన బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలను సురక్షితంగా సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని, వైఎస్ జగన్ మాత్రం ఏం జరిగిందో కూడా కనీసం ఆరా తీయలేని స్థితిలో ఉండి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.