Share News

రీసర్వేకారణంగా తల్లికి వందనం రాలేదు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:18 AM

గత ప్రభుత్వంలో రీసర్వే తప్పులు తడకగా నిర్వహించడంతో అర్హులైన విద్యార్థులకు తల్లికి వంద నం రాలేదని ఈవిషయమై తగు చర్యలు తీసుకోవా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతు న్నారు.

రీసర్వేకారణంగా తల్లికి వందనం రాలేదు
తహసీల్దారు దస్తగిరికి వినతిప్రత్రం అందిస్తున్న దృశ్యం

అర్హులకు న్యాయం చేయండి తహసీల్దార్‌కు వినతి

బి.కోడూరు, జూన 16 (ఆంధ్రజ్యో తి): గత ప్రభుత్వంలో రీసర్వే తప్పులు తడకగా నిర్వహించడంతో అర్హులైన విద్యార్థులకు తల్లికి వంద నం రాలేదని ఈవిషయమై తగు చర్యలు తీసుకోవా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతు న్నారు. ఆ మేరకు బీజేపీ జిల్లా ఉపా ధ్యక్షుడు తిప్పలూరు సుబ్బారెడ్డితో కలి సి సోమవారం తల్లికి వందనం పడని లబ్ధి దారులు తహసీల్దారు దస్తగిరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు మంది రైతులకు కలిపి ఒకే ఎల్‌పీ నెంబరు ఒక రైతుకు ఇవ్వడం తో భూమి ఎక్కువగా చూపుతున్నం దు ఆ రైతు కుటుంబాలకు తల్లికి వందనం పడలేదని వారన్నారు. ఒక్క బికోడూరు మండలంలోనే దాదాపు 600మంది విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం పడలేదని దీనిపై ఎందుకు పడలేదని విచారించగా గత ప్రభుత్వంలో రీసర్వే తప్పులతడకగా నిర్వహించి ఎల్‌పీ నెంబర్లు సక్రమంగా ఇవ్వకపోవ డంతో వారికి అధికంగా భూములు ఆనలైనలో చూపుతుండడంతో వారందరికీ తల్లికి వందనం నిధులు పడలేదన్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి అర్హులైన వారికి తల్లికి వందనం పడేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:18 AM