Share News

చంద్ర ప్రకాశం

ABN , Publish Date - Oct 20 , 2025 | 01:29 AM

సీఎం చంద్రబాబు రాకతో బెజవాడలో ఒక రోజు ముందే దీపావళి పండుగ వచ్చింది. బీసెంట్‌ రోడ్డులో పర్యటించిన ఆయన వీధి వ్యాపారులు, దుకాణదారులతో ముచ్చటించారు. వారి వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. జీఎస్‌టీ తగ్గింపులపై ఆరా తీసి వారికి భరోసా ఇచ్చారు. దీపావళి వేళ చంద్రుడి వలే ప్రకాశిస్తున్న చంద్రబాబుతో సెల్ఫీ దిగేందుకు యువత పోటీ పడ్డారు. అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

చంద్ర ప్రకాశం

- పండుగ వేళ బెజవాడలో సీఎం చంద్రబాబు పర్యటన

- బీసెంట్‌ రోడ్డులో వీధి వ్యాపారులు, దుకాణదారులతో ముచ్చట్లు

- పున్నమిఘాట్‌లో సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌, దీపావళి వేడుకలకు సతీసమేతంగా హాజరు

-ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈవెంట్స్‌గా విజయవాడ కావాలి

- శని, ఆదివారాల్లో వినోదాత్మక ఈవెంట్స్‌ జరుపుకోండి

- నగర వాసులకు ముఖ్యమంత్రి పిలుపు

సీఎం చంద్రబాబు రాకతో బెజవాడలో ఒక రోజు ముందే దీపావళి పండుగ వచ్చింది. బీసెంట్‌ రోడ్డులో పర్యటించిన ఆయన వీధి వ్యాపారులు, దుకాణదారులతో ముచ్చటించారు. వారి వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. జీఎస్‌టీ తగ్గింపులపై ఆరా తీసి వారికి భరోసా ఇచ్చారు. దీపావళి వేళ చంద్రుడి వలే ప్రకాశిస్తున్న చంద్రబాబుతో సెల్ఫీ దిగేందుకు యువత పోటీ పడ్డారు. అంతటా పండుగ వాతావరణం నెలకొంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /వన్‌టౌన్‌):

‘‘విజయవాడలో ఇక ప్రతి శని, ఆదివారాలు వినోదాత్మక ఈవెంట్స్‌ జరుపుకోండి. మీకు నచ్చిన పని చేసి ఎనర్జీని చార్జ్‌ చేసుకోండి. మిగిలిన రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేయండి’’ అంటూ నగర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. పున్నమిఘాట్‌లో ఆదివారం నిర్వహించిన సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌, దీపావళి వేడుకలకు సీఎం చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విజయవాడలో ఉండేవాళ్లు ప్రపంచంలో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మీతో పుట్టిన వాళ్లు పేదరికంలో ఉన్నారు. అలాంటి వారిని పీ4 బాధ్యతగా తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఘంటసాల పవన్‌కుమార్‌ బృందం సమర్పించిన నరకాసుర వథ నృత్య రూపకాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత జరిగిన సభలో చంద్రబాబు జీఎస్టీ ప్రయోజనాల గురించి వివరించారు. ఫైర్‌ క్రాకర్స్‌ షోను ఆయన రిమోట్‌ నొక్కి ప్రారంభించారు. అనాథ పిల్లలతో కలిసి బాణసంచా వెలుగులను వీక్షించారు. తన సెల్‌ఫోన్‌తో బాణసంచా వెలుగు జిలుగులను వీడియో తీశారు.

బీసెంట్‌ రోడ్డులో సందడి చేసిన సీఎం

సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌పై బీసెంట్‌ రోడ్డులోకి వచ్చారు. కాన్వాయ్‌ దిగిన ఆయన నడుచుకుంటూ ముందుకు సాగారు. రోడ్డుకు రెండు వైపులా దుకాణాలలో షాపింగ్‌ చేస్తున్నవారు హర్షధ్వానాలు చేశారు. చంద్రబాబు అందరికీ అభివాదం చేస్తూ వీధి వ్యాపారుల దగ్గరకు వెళ్లారు. పలువురిని పలకరించి వారి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే .. జీఎస్టీ ప్రయోజనాల గురించి ఆరా తీశారు. అక్కడే ఉన్న పలు దుకాణాలకు కూడా చంద్రబాబు వెళ్లారు. షాపింగ్‌కు వచ్చిన వారు చంద్రబాబుతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. షాపింగ్‌కు వచ్చిన యువతులతో చంద్రబాబు మాట్లాడారు. పిల్లల్ని ఎత్తుకున్నారు. మట్టి దీపాల ప్రమిదలను పరిశీలించారు.

రాష్ట్రంలో ప్రతి రోజూ పండుగే : కేశినేని శివ నాథ్‌

సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్‌ సభలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంగా తీసుకువెళ్లే ముఖ్యమంత్రి ఉండటం వల్ల రాష్ట్రంలో ప్రతి రోజూ పండగగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సహకారం, మంత్రి లోకేశ్‌ ఆధ్వర్యంలో విశాఖకు గూగుల్‌ రావటంతో వారం రోజుల ముందుగానే రాష్ర్టానికి దీపావళి వచ్చిందన్నారు. అత్యంత రద్దీగా ఉండే బీసెంటు రోడ్డులో జీఎస్టీ వ్యాపారులను పలకరించటం ఆనందంగా ఉందన్నారు. ఏపీలో వచ్చే మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను స్థానిక యువతకు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామమోహన్‌, వసంత కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2025 | 01:29 AM