Share News

అమ్మా వెళ్లి వస్తా..

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:39 PM

హాస్టల్‌ ఉండి చదువుకుంటున్న కొడుకు దసరా సెలవులకు ఇంటికొచ్చాడు.. సెలవులంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు..

   అమ్మా వెళ్లి వస్తా..
లారీ ఢీకొనడంతో ప్రమాద ప్రాంతంలో పడి ఉన్న విద్యార్థి శ్రీనివాసులు

పాఠశాలకు వెళ్తూ అనంత లోకాలకు..

రోడ్డుప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం

బిల్లేకల్‌ సమీపంలో ఘటన

మృతులు క్రిష్ణగిరి మండలం పోతుగల్లు వాసులు

ఆస్పరి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): హాస్టల్‌ ఉండి చదువుకుంటున్న కొడుకు దసరా సెలవులకు ఇంటికొచ్చాడు.. సెలవులంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపాడు.. ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.. ఇంతలోనే సెలవులు ముగిశాయి.. బడులు తెరుచుకున్నాయి.. ‘అమ్మా వెళ్లి వస్తా.. అక్క.. చెల్లి జాగ్రత్త..’ మళ్లీ సెలవుల్లో వస్తా.. అంటూ తల్లి, అక్క, చెల్లితో అన్న చివరి మాటలు.. ఇక కొడుకును తీసుకొని పాఠశాలలో వదిలేందుకు బైక్‌పై తండ్రి బయలుదేరారు. తండ్రీకొడుకులు మాట్లాడుకుంటూ ఒక గంట పాటు ప్రయాణాన్ని సాఫీగా సాగించారు.. ఇంకో గంటల్లో వారు తమ గమ్యస్థానానికి చేరుకునే వారు.. అంతలోనే అతివేగంతో ఎదురుగా లారీ రూపంలో మృత్యువు వచ్చి వారి కబళించింది. ఈ ప్రమాదంలో విద్యార్థి శ్రీనివాసులు(14) అక్కడికక్కడే చనిపోయాడు. తండ్రిని కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ హృదయ విదారక ఘటన గురువారం ఆస్పరి మండలంలోని బిల్లేకల్‌ గ్రామ సమీపంలో చోటుచేసుకున్నట్లు సీఐ మస్తాన తెలిపారు. వివరాలు.. క్రిష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన మాల దాసరి శ్రీనివాసులు(14) అరికెర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు నిమిత్తం గ్రామానికి వచ్చాడు. సెలవులు ముగియగా తండ్రి మాల దాసరి మహేష్‌(45)తో కలిసి బైక్‌పై పాఠశాలకు పయనమయ్యాడు. బిల్లేకల్‌ గ్రామ సమీపంగా చేరుకున్నారు. బళ్లారి వైపు నుంచి కర్నూలుకు వెళ్తున్న లారీ అతివేగంగా ఎదురుగా వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థి శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దాసరి మహేష్‌ను కర్నూలు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య రామేశ్వరమ్మ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. తండ్రీకొడుకు మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు

Updated Date - Oct 09 , 2025 | 11:39 PM