మోదీ మత రాజ్యం ప్రమాదకరం
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:42 PM
ప్రధాని మోదీ మత రాజ్యం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే ప్రమాదకరమని సీపీఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు ఎంఏ గఫూర్ ధ్వజమెత్తారు.
సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ ధ్వజం
కర్నూలు న్యూసిటీ, జూన 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ మత రాజ్యం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే ప్రమాదకరమని సీపీఎం మాజీ కేంద్ర కమిటి సభ్యులు ఎంఏ గఫూర్ ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్బంగా కర్నూలు కార్మిక కర్షక భవనలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ అధ్యక్షతన బుధవారం ‘ఎమర్జెన్సీ నాడు - నేడు’ జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఏ గఫూర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే భారతప్రజలు చైతన్యవంతులని 1977లో కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారా రుజువైందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన వాళ్లను ప్రజలు క్షమించరనేది ఎమర్జెన్సీ ద్వారా నిరూపితమైందన్నారు. మోదీది అమెరికాకు లొంగిన విదేశాంగ విధానమన్నారు. మతోన్మాదం అనే మహాప్రమాదాన్ని ఎలా ఎదుర్కొవాలో ప్రజలకు చైతన్యపరచాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్, కార్యదర్శి వర్గ సభ్యులు పి.నిర్మల, పీఎస్ రాధాకృష్ణ, ఎండీ ఆనంద్‌బాబు, టి.రాముడు, ఎండీ అంజిబాబు, కేవీ నారాయణ, నగర కార్యదర్శి రాజశేఖర్, నగర నాయకులు పాల్గొన్నారు.