మోదీ సభను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:06 AM
కర్నూలు నన్నూరు టోల్‌ఫ్లాజా సమీపంలోని రాగమయూరి వెంచర్‌లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కోరారు.
పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు
నంద్యాల రూరల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : కర్నూలు నన్నూరు టోల్‌ఫ్లాజా సమీపంలోని రాగమయూరి వెంచర్‌లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కోరారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనఎండీ ఫిరోజ్, టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు ఆలం నర్సంనాయుడుతో కలిసి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సభకు సంబంధించిన స్టిక్కర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన గుంటుపల్లి హరిబాబు, కౌన్సిలర్లు కండే శ్యాం సుందర్‌లాల్, శ్రీదేవి, మైనారిటీ ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్ మునియార్ ఖలీల్, పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయగౌరీ, మున్సిపల్ కమిషనర్ శేషన్న పాల్గొన్నారు.