MLC Panchumarthi Anuradha: యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లోకి ఆంధ్ర
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:45 AM
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని ప్రభుత్వ చీఫ్ విఫ్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు.
దానికి గేట్ వేగా మారిన కుప్పం
యువత భవిష్యత్ నాశనం చేయడమే జగన్ లక్ష్యం: పంచుమర్తి
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని ప్రభుత్వ చీఫ్ విఫ్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. ‘ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అమెరికా దిగ్గజం యాపిల్ కోసం ఐఫోన్ చాసిస్‌కు అవసరమైన హై-గ్రేడ్ అల్యూమినియం ఇక నుంచి కుప్పం నుంచే సరఫరా అవుతుంది. హిందాల్కో రూ.586 కోట్ల పెట్టుబడితో కుప్పంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 613 ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు లాజిస్టిక్స్, సేవలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వేలాది అనుబంధ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లోకి లాగే గేట్ వేగా కుప్పం మారింది. చంద్రబాబు, లోకేశ్ కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తుంటే సిగ్గులేకుండా జగన్ రెడ్డి దొంగ మెయిల్స్ పంపి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. రాష్ట్ర యువత భవిష్యత్తును నాశనం చేయడమే జగన్ లక్ష్యం. జగన్ వలన పిల్లలు చెడిపోతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి’ అని పంచుమర్తి సూచించారు.