AP CM: ఎమ్మెల్యేలు పాజిటివ్ కర్మ చేయాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 04:11 AM
ఎమ్మెల్యేలు పాజిటివ్ కర్మ చేయాలి. చాలామంది చూడటానికి మంచి శారీరక దారుఢ్యంతో కనిపిస్తారు. కానీ, లోపల చాలా రోగాలు ఉంటాయి. నేను గతంలో డాక్టర్లకు దీనిపై కొన్ని సూచనలు చేసేవాడిని...
‘‘ఎమ్మెల్యేలు పాజిటివ్ కర్మ చేయాలి. చాలామంది చూడటానికి మంచి శారీరక దారుఢ్యంతో కనిపిస్తారు. కానీ, లోపల చాలా రోగాలు ఉంటాయి. నేను గతంలో డాక్టర్లకు దీనిపై కొన్ని సూచనలు చేసేవాడిని. ‘నాకు చికిత్స చేయడమేకాదు.. వైద్యులుగా మీ ఆరోగ్యం కూడా బాగు చేసుకోండి’ అని చెప్పేవాడిని. శారీరక వ్యాయామం బాగా తగ్గిపోయింది. ప్రతి ఎమ్మెల్యే హెల్దీగా, హ్యాపీగా ఉండాలి. ఇక్కడనుంచి ఇంటికి వెళ్లగానే ఆనందంగా నిద్రపోండి. బాడీ చార్జ్ కావాలంటే నిద్ర కావాలి. నావరకు నేను.. గతంలో వలే హార్డ్ వర్క్ చేయడం లేదు. టెక్నాలజీ వల్ల అన్ని సులువుగా తెలిసిపోతున్నాయి.. పాజిటివ్ కర్మ చేస్తే మళ్లీ ఎమ్మెల్యేలుగా మీరే వస్తారు.’’ అని సూచించారు. కాగా, తాను, మంత్రి అచ్చెన్న సీఎం సూచించిన పాజిటివ్ కర్మ చేసేందుకు ప్రయత్నిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. సీఎం ప్రసంగంలో మంచి నిద్ర ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘మీరు సరిగా నిద్రపోవడం లేదు’ అని అంటున్నారని రఘురామ సరదాగా అన్నారు. ఎమ్మెల్యే కామినేని ఆరోగ్యంగా కనిపిస్తున్నారని మరో సందర్భంలో.. సీఎం అన్నారు. కాగా, రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పనితీరు దేశంలోనే అద్భుతంగా ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు.