MLA Yarlagadda: ఆ కంపెనీ పేర్లు కూడా వైసీపీ నేతలు పలకలేరు
ABN , Publish Date - Dec 12 , 2025 | 07:00 AM
సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కష్టపడుతుంటే వైసీపీ నాయకులు...
18 దిగ్గజ కంపెనీల సీఈవోలతో లోకేశ్ భేటీ: ఎమ్మెల్యే యార్లగడ్డ
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కష్టపడుతుంటే వైసీపీ నాయకులు విమర్శలే పనిగా అడ్డం పడుతున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్ర యువతకు ఉద్యోగావకాలు కల్పించాలన్న లక్ష్యంతో లోకేశ్ తిరుగుతున్నారు. ఇటీవల మూడు రోజుల్లో 18 ప్రపంచ దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఎగ్జిక్యూటివ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఆ కంపెనీల పేర్లు పలకడం కూడా వైసీపీ నాయకులకు రాదు. గుడివాడ ప్రజలు తనను ఓడించారన్న కక్షతో కొడాలి నాని ఏడాది పాటు ఆ నియోజకవర్గం వైపే చూడలేదు’ అని యార్లగడ్డ విమర్శించారు.