MLA Somireddy: జగన్‌లో ఏదో తేడా కనిపిస్తోంది
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:19 AM
వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిలో ఏదో తేడా కనిపిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
వెంటనే చికిత్స చేయించాలి: ఎమ్మెల్యే సోమిరెడ్డి
నెల్లూరు(వైద్యం), అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిలో ఏదో తేడా కనిపిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానిగా ఆయన బ్యానర్లు, ఫ్లెక్సీలు మోసినోడు... ఇప్పుడు తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చుని విచిత్రంగా మాట్లాడుతున్నాడు. తల్లికి, చెల్లికి దూరంగా ఉన్నాడు. కనీసం భారతమ్మ అయినా జగన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి బ్రెయిన్ పరీక్ష చేయించాలి. నాకైతే జగన్‌లో ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకు వైద్యుల సమక్షంలో చికిత్స అవసరం’ అని సోమిరెడ్డి అన్నారు.