Share News

MLA MS Raju: బైకుపై నలుగురితో ప్రయాణం.. ప్రమాదం కాదా

ABN , Publish Date - Nov 11 , 2025 | 05:06 AM

మహిళలు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారు. అయినా ఇలా బైక్‌పై పరిమితికి మించి ప్రయాణిస్తే ఎలా...

MLA MS Raju: బైకుపై నలుగురితో ప్రయాణం.. ప్రమాదం కాదా

  • వాహనాన్ని ఆపి అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు

మడకశిర టౌన్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ‘మహిళలు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారు. అయినా ఇలా బైక్‌పై పరిమితికి మించి ప్రయాణిస్తే ఎలా?’ అని శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ప్రశ్నించారు. అనంతపురం నుంచి సోమవారం మడకశిరకు వస్తున్న ఆయన.. మడకశిర నగర పంచాయతీ పరిధిలోని చౌటిపల్లి వద్ద ఒక బైక్‌పై ముగ్గురు మహిళల సహా నలుగురు ప్రయాణిస్తుండటాన్ని గమనించారు. తన వాహనాలను ఆపి, వారితో మాట్లాడారు. ఒక బైక్‌పై నలుగురు ప్రయాణించడం ప్రమాదకరం అని, ఇలా ఎప్పుడూ చేయొద్దని వారికి సూచించారు. తన వెంట వచ్చిన ఓ వాహనంలో ముగ్గురు మహిళలను ఎక్కించి, వారి గ్రామానికి పంపించారు. వారిని ఇంటి వద్ద దించి రావాలని సిబ్బందికి సూచించారు. వారు చౌటిపల్లి నుంచి వారు గౌడనహళ్లి గ్రామానికి వెళుతూ ఎమ్మెల్యే కంటపడ్డారు.

Updated Date - Nov 11 , 2025 | 05:06 AM