Share News

AP Public Prosecutors Association: ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Oct 20 , 2025 | 05:49 AM

ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌(క్యాడర్‌) సంఘం అధ్యక్షులుగా ఎం.కె.విజయలక్ష్మి, కార్యదర్శిగా ఆర్‌.జగదీష్‌ ఎన్నికయ్యారు.

AP Public Prosecutors Association: ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

విజయవాడ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌(క్యాడర్‌) సంఘం అధ్యక్షులుగా ఎం.కె.విజయలక్ష్మి, కార్యదర్శిగా ఆర్‌.జగదీష్‌ ఎన్నికయ్యారు. రిటైర్డ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు పి.శేషయ్య, ఎన్‌.ఉమావతి ఆధ్వర్యాన ముత్యాలంపాడులోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన సంఘ ఎన్నికల్లో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. క్యాడర్‌ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు వెల్లడించారు.

Updated Date - Oct 20 , 2025 | 05:49 AM