Share News

Mithun Reddy: రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వండి

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:02 AM

వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఏ-4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు.

Mithun Reddy: రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వండి

ఇంటి భోజనానికి అనుమతించండి: ఏసీబీ కోర్టులో మిథున్‌రెడ్డి

విజయవాడ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో ఏ-4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విజయవాడలోని ఏసీబీ కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడంతోపాటు జైల్లో ఉన్నన్ని రోజులు 2 పూటలా ఇంటి నుంచి భోజనం అనుమతించాలని పిటిషన్లలో అభ్యర్థించారు. వీటిపై విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అదేవిధంగా జైల్లో ఉన్న మిథున్‌రెడ్డికి పలు సదుపాయాలు కల్పిస్తూ ఏసీబీ కోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను పునః సమీక్షించాలని కోరుతూ జైళ్ల శాఖ అధికారులు ఇదే కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై కూడా 12వ తేదీన విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.

సజ్జల బెయిల్‌ పిటిషన్‌ దాఖలు: మద్యం కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి మరోసారి ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నలుగురికి బెయిల్‌ రావడంతో ఆయన మూడోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated Date - Sep 09 , 2025 | 05:04 AM