Share News

Rajamahendravaram Central Jail: జైల్లో లొంగిపోయిన మిథున్‌రెడ్డి

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:04 AM

మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు లో లొంగిపోయారు.

Rajamahendravaram Central Jail: జైల్లో లొంగిపోయిన మిథున్‌రెడ్డి

  • జైలు బయట వేడుకగా పుట్టినరోజు

  • పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణుల హాజరు

  • స్తంభించిన ట్రాఫిక్‌.. చిక్కుకున్న అంబులెన్స్‌

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి గురువారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు లో లొంగిపోయారు. రిమాండు ఖైదీగా ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోడానికి వీలుగా ఈ నెల 6న కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన జైలు సూపరింటెండెంట్‌ ఎదుట లొంగిపోయారు. అంతకుముందు సుమారు 25 కార్ల కాన్వాయ్‌తో జైలు బయట ఉన్న ఓ ప్రైవేటు హోటల్‌ వద్ద చేరుకొని ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. వైసీపీ నాయకులు పూలబొకేలు అందజేసి, పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. పండితులు వేదాశీర్వచనం అందించారు. దీంతో జైలు బయట రోడ్డుపై ట్రాఫిక్‌ స్తంభించింది. ఆస్పత్రికి రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్‌ ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దీనిపై జనం మండిపడ్డారు.

Updated Date - Sep 12 , 2025 | 05:06 AM