Share News

AP High Court: సొమ్ము మళ్లింపులో మిథున్‌రెడ్డిది కీలకపాత్ర

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:30 AM

మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఖాజానాకు రూ. 3,500 కోట్ల నష్టం జరిగిందని, ఈ సొమ్మును మళ్లించడంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రాసిక్యూషన్‌...

AP High Court: సొమ్ము మళ్లింపులో మిథున్‌రెడ్డిది కీలకపాత్ర

  • హైకోర్టుకు తెలిపిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఖాజానాకు రూ. 3,500 కోట్ల నష్టం జరిగిందని, ఈ సొమ్మును మళ్లించడంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రాసిక్యూషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడానికి వీల్లేదన్నారు. ముడుపుల సొమ్ము ఎక్కడికి చేరిందనే విషయాన్ని తేల్చేందుకు పిటిషనర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ముడుపుల ఇచ్చిన కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారన్నారు. యజమానులను బెదిరించి మద్యం ఉత్పత్తి కంపెనీలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారన్నారు. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4గంటలులోపు అందజేయాలని ఆదేశించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Updated Date - Jul 11 , 2025 | 04:30 AM