ACB Court: మిథున్‌రెడ్డి ఢిల్లీ పిటిషన్ నేటికి వాయిదా
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:27 AM
పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై...
విజయవాడ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి బెయిల్‌పై బయట ఉన్నారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని షరతు పెట్టింది.