Mithun Reddy Interim Bail: మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై 6న తీర్పు
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:41 AM
మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిమధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విజయవాడ...
విజయవాడ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిమధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. మధ్యంతర బెయిల్‌పై వాదనలు ముగియడంతో తీర్పును ఆరో తేదీన వెలువరిస్తామని న్యాయాధికారి పి.భాస్కరరావు తెలిపారు. రెగ్యులర్ బెయిల్‌పై విచారణను ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు. అదేవిధంగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఆరో తేదీన తీర్పును వెలుస్తామని కోర్టు వెల్లడించింది.