Vijayawada: ఏసీబీ కోర్టులో మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:19 AM
మద్యం కేసులో నిందితుడు(ఏ4)గా ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మరో ముగ్గురి పిటిషన్లపై విచారణ వాయిదా
విజయవాడ, జూలై 24(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో నిందితుడు(ఏ4)గా ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున న్యాయవాదులు కోర్టులో గురువారం ఈ పిటిషన్ వేశారు. కాగా, మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. వాటిపై ఏసీబీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మూడు పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయాధికారి భాస్కరరావు ప్రాసిక్యూషన్‌ను ఆదేశించారు. కాగా, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలులో వంట చేసుకుంటానని దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఈనెల 30వ తేదీకి ఆయన వాయిదా వేశారు.