Share News

Rajamahendravaram: జైల్లో మిథున్‌రెడ్డిని కలిసిన తల్లి ములాఖత్‌లో చెల్లి, బావ కూడా..

ABN , Publish Date - Jul 29 , 2025 | 05:05 AM

లిక్కర్‌ స్కాం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఆయన తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్‌ సోమవారం ములాఖత్‌లో కలిశారు.

Rajamahendravaram: జైల్లో మిథున్‌రెడ్డిని కలిసిన తల్లి ములాఖత్‌లో చెల్లి, బావ కూడా..

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): లిక్కర్‌ స్కాం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఆయన తల్లి స్వర్ణలత, చెల్లి శక్తి రెడ్డి, బావ అఖిల్‌ సోమవారం ములాఖత్‌లో కలిశారు. సుమారు 45 నిమిషాలు పాటు వారు జైల్లో మిథన్‌రెడ్డితో మాట్లాడారు. మిథున్‌రెడ్డి కుటుంబసభ్యులను మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మజీ ఎంపీ భరత్‌ తదితరులు జైలు వద్ద కలిశారు. ములాఖత్‌ అనంతరం మిథున్‌రెడ్డి తల్లి మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు ఏ తప్పు చేయలేదన్నారు. ధైర్యంగా ఉండాలని తన కొడుక్కి చెప్పానన్నారు. టెర్రరిస్టులను చూసినట్టు కాకుండా తన కుమారుడిని బాగా చూసుకోవాలని కోరారు.

Updated Date - Jul 29 , 2025 | 05:07 AM