Share News

Minor Girl Assaulted: తాతయ్యనని చెప్పి.. తోటలోకి తీసుకెళ్లి..!

ABN , Publish Date - Oct 23 , 2025 | 05:00 AM

తాతయ్య వరసైన దగ్గర బంధువు మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా తునిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

Minor Girl Assaulted: తాతయ్యనని చెప్పి.. తోటలోకి తీసుకెళ్లి..!

  • మైనర్‌ బాలికపై వృద్ధుడి అత్యాచారం

  • నిందితుడిపై పోక్సో కేసు నమోదు

తుని రూరల్‌/కాకినాడ/అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): తాతయ్య వరసైన దగ్గర బంధువు మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా తునిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తుని పట్టణానికి చెందిన బాలిక స్థానిక గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె సమీప బంధువు తాటిక నారాయణరావు(62) అప్పుడప్పుడూ గురుకుల పాఠశాలకు వచ్చి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లాలనే నెపంతో బయటకు తీసుకువెళ్తున్నాడు మంగళవారం కూడా బాలికను నిందితుడు పాఠశాల నుంచి తీసుకువెళ్లాడు. అక్కడి నుంచి తొండంగి మండలం పైడికొండ గ్రామ శివార్లలోని సపోటా తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు విన్న తోటమాలి వచ్చి నిందితుడిని నిలదీశాడు. తాను బాలిక బంధువునని, తోటలోకి బహిర్భూమికి తీసుకొచ్చానని చెప్పాడు. నారాయణరావు తనకు తాతయ్య అవుతారని ఆ బాలిక కూడా చెప్పింది. తర్వాత వారిద్దరూ స్కూటీపై వెళ్లిపోయారు. బాలికను హాస్టల్‌లో దించి నిందితుడు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే తోటలో వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మంగళవారం రాత్రి బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు నారాయణరావుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నారాయణరావుపై పోక్సో కేసుతో పాటు కిడ్నాప్‌, అత్యాచారం కింద వివిధ సెక్షన్లు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు వివరించారు. పార్టీల మధ్య గొడవలు సృష్టించేందుకు అసత్య ప్రచారాలు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, బాలికపై అత్యాచారం ఘటనపై మంత్రి లోకేశ్‌ స్పందించారు. బాధితురాలు ధైర్యంగా ఉండాలని, సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తెలిపారు. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీని ఆమె ఆదేశించారు.

Updated Date - Oct 23 , 2025 | 05:00 AM