మైనర్ ప్రసవం
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:54 PM
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ మైనర్ ప్రసవం అయిన సంఘటన నంద్యాల జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
కడుపునొప్పితో ఆసుపత్రికి రాక...
ప్రసవం చేసిన వైద్యులు
బంధువుల అబ్బాయే కారణమంటున్న బాలిక
నందికొట్కూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ మైనర్ ప్రసవం అయిన సంఘటన నంద్యాల జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసు లు, ఐసీడీఎస్ అధికారులు తెలిపిన వివరాలు.. మిడ్తూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ (17.9 సంవత్సరాలు) ఇటీవలే ఇంటర్ పూర్తిచేసింది. గురువారం ఉద యం కడుపు నొప్పి రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆమె తల్లి తీసుకొచ్చారు. వైద్యులు పరిశీలించి పరీక్షలు చేసి చూడగా బాలిక కడుపుతో ఉందని తల్లికి చెప్పారు. అదే క్రమంలో పురిటి నొప్పులు రావడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. తాను గత ఏడాది నందికొట్కూరులోని ఓజూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశానని ఆ బాలిక తెలిపింది. ఆ సమయంలో నందికొట్కూరు మండలంలోని ఓగ్రామానికి చెందిన తమ బంధువుల అబ్బాయితో చనువుగా ఉన్నట్లు బాలిక తెలి పింది. ఆ సమయంలో అతడితో తరచూ బయటకు వెళ్లేదాన్ని అని బాలిక తెలిపింది. దీంతో పుట్టిన ఆడ శిశువును మీ వెంట తీసుకెళ్తారా? లేక చిల్డ్రనహోంకు తీసుకెళ్లాలా? అని ఐసీడీఎస్ అధికారులు ప్రశ్నించారు. తన భర్తతో చర్చించి విషయాన్ని చెబుతా మని బాలిక తల్లి ఐసీడీఎస్ అధికారులకు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.