Share News

AP Ministers: సూపర్‌హిట్‌ సభపై మంత్రుల బృందం సమీక్ష

ABN , Publish Date - Sep 07 , 2025 | 04:44 AM

నంతపురంలో ఈ నెల 10న జరిగే ‘సూపర్‌ సిక్స్‌- సూపర్‌ హిట్‌’ బహిరంగ సభ గురించి ఏడుగురు మంత్రుల బృందం శనివారం సమీక్ష నిర్వహించింది.

AP Ministers: సూపర్‌హిట్‌ సభపై మంత్రుల బృందం సమీక్ష

  • అనంతలో 10న జరిగే సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): అనంతపురంలో ఈ నెల 10న జరిగే ‘సూపర్‌ సిక్స్‌- సూపర్‌ హిట్‌’ బహిరంగ సభ గురించి ఏడుగురు మంత్రుల బృందం శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగర శివారులోని ఇంద్రప్రస్థ గ్రౌండ్స్‌లో భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సభ, హెలీప్యాడ్‌, పార్కింగ్‌ ఏర్పాట్ల గురించి తెలుసుకునేందుకు మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌, నారాయణ, కొల్లు రవీంద్ర, సవిత, గట్టిపాటి రవికుమార్‌, రాంప్రసాద్‌రెడ్డి అనంతపురం వచ్చారు. మొదట ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ జగదీశ్‌తో చర్చించారు. బహిరంగ వేదిక, పార్కింగ్‌, హెలీప్యాడ్‌ వద్ద ఏర్పాట్లు, భద్రత గురించి తెలుసుకున్నారు. అనంతరం సభాస్థలి వద్ద టీడీపీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి అనంతపురం జిల్లా పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులతో కలసి సుమారు గంటపాటు చర్చించారు. వేదిక వద్ద పనులను మంత్రుల బృందం పరిశీలించింది. సమీక్షలకు మీడియాను దూరం పెట్టారు.

Updated Date - Sep 07 , 2025 | 04:46 AM