పీపీపీతో మెరుగైన విద్య, వైద్యం: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:10 AM
మెడికల్ కళాశాలలపై వైసీపీ నాయుకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
శవ రాజకీయాలు మానుకోండి: మంత్రి సంధ్యారాణి
విజయనగరం నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మెడికల్ కళాశాలలపై వైసీపీ నాయుకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు పెరుగుతాయని, పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యం అందుతుందని అన్నారు. గురువారం విజయనగరంలో జరిగిన జడ్‌పీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క విజయనగరం వైద్య కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించి, పూర్తి చేయాలంటే ఇంకా రూ.600 కోట్లు అవసరమని గుర్తు చేశారు. వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ... ‘పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాలకు స్థల సేకరణే జరగలేదు. దీనిపై కూడా రాద్ధాంతం చేయడం తగదు’ అని అన్నారు.