AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై కసరత్తు
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:40 AM
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
10 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదోన్నతులపై అధ్యయనానికి 10 మంది సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు ఇతర మంత్రులు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ, సత్యకుమార్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి ఉన్నారు. ఉపసంఘానికి కార్యదర్శిగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శిని నియమించారు. పదోన్నతుల తర్వాత ఖాళీల భర్తీపై హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా ఖరారు చేయాలని సూచించింది. వీలైనంత త్వరగా దీనిపై అధ్యయనం చేసి.. సిఫారసులతో కూడిన నివేదికను సమర్పించాలని పేర్కొంది.