Minister Subhash: 12న బీసీ ప్రజాప్రతినిధులతో భేటీ
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:07 AM
సీ మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయవాడలో 12న సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు..
అమరావతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయవాడలో 12న సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కులాల మధ్య అల్లర్లు సృష్టించి, విష ప్రచారం చేస్తూ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు. వైసీపీ గాలి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని ఓసీల్లో చేరుస్తున్నారంటూ కోనసీమ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రతిపక్షం కాదు, విషవృక్షం అని మంత్రి విమర్శించారు.