భవన నిర్మాణ కార్మికులకు శిక్షణ: మంత్రి సుభాష్
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:58 AM
రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు మెరుగైన ఉపాధి కోసం రూ.70 కోట్లతో శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.
విశాఖపట్నం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు మెరుగైన ఉపాధి కోసం రూ.70 కోట్లతో శిక్షణ ఇవ్వనున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నం వచ్చిన ఆయన పలు భవనాలను పరిశీలించారు. అక్కడ కార్మికులకు కల్పించిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. ఆ తర్వాత కోనసీమ, ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వారికి నిలిపివేసిన పథకాలన్నింటినీ కొనసాగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.