Share News

Minister Savitha: వైసీపీ నాయకుల బ్రోకర్‌ పేర్ని

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:46 AM

దోచుకోవడం, దాచుకోవడం కోసం వైసీపీ నాయకులకు మాజీ మంత్రి పేర్ని నాని బ్రోకర్‌లా పనిచేశారు అని మంత్రి సవిత విమర్శించారు.

Minister Savitha: వైసీపీ నాయకుల బ్రోకర్‌ పేర్ని

  • ఉగ్రవాదుల్లా మారిన ఆ పార్టీ ముఖ్య నేతలు: మంత్రి సవిత

పెనుకొండ టౌన్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘దోచుకోవడం, దాచుకోవడం కోసం వైసీపీ నాయకులకు మాజీ మంత్రి పేర్ని నాని బ్రోకర్‌లా పనిచేశారు’ అని మంత్రి సవిత విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘పేదలకు అందాల్సిన 7,580 కేజీల రేషన్‌ బియ్యం బస్తాలను స్వాహా చేసిన పంది కొక్కు. తన అవినీతి బయటపడుతుందన్న భయంతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. చీకట్లో జరిగే పనుల గురించి మాజీ మంత్రి పేర్ని నాని పట్టపగలు చెప్పడం దే నికి సంకేతం? వైసీపీ కార్యకర్తలే ఆ పార్టీ నాయకులను ఛీ కొడుతున్నారు’ అని మంత్రి విమర్శించారు.

Updated Date - Jul 13 , 2025 | 04:47 AM