Minister Savitha: దమ్ముంటే అసెంబ్లీకి రా.. జగన్‌కు సవిత సవాల్
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:16 AM
అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి.. నేడు నీతులు చెబుతున్న జగన్ దమ్ముంటే ఈ నెల 18న..
సోమందేపల్లి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి.. నేడు నీతులు చెబుతున్న జగన్ దమ్ముంటే ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని మంత్రి సవిత సవాల్ విసిరారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో ఆదివారం సూపర్‌సిక్స్, సూపర్‌హిట్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియాను పుష్కలంగా అందిస్తుంటే.. కొరత ఉందని వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి కనీసం సొంత నియోజకవర్గం పులివెందుల గురించైనా మాట్లాడాలన్నారు.