Minister Savitha: మీరు ఫుల్ నాలెడ్జ్ ఉన్నోళ్లు కదా..
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:27 AM
మీరంతా ఫుల్ నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా.. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడ మెందుకు అసెంబ్లీకి రండి.. యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు.. ఏ అంశంపైనైనా చర్చిద్దాం అని
అసెంబ్లీకి రండి.. ఏ అంశంపైనైనా చర్చిద్దాం
జగన్, వైసీపీ నాయకులకు మంత్రి సవిత సవాల్
మెడికల్ కాలేజీలపై నిజం చెబితే భయమెందుకు?
తప్పుడు ప్రచారాలతో వికృతానందం
నా ఫొటో మార్ఫింగ్‌పై ఫిర్యాదుచేశా: మంత్రి
అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘మీరంతా ఫుల్ నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా.. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడ మెందుకు? అసెంబ్లీకి రండి.. యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు.. ఏ అంశంపైనైనా చర్చిద్దాం’ అని మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులకు బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత ఎద్దేవా చేస్తూ సవాల్ విసిరారు. తన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన్ ఓర్వలేక విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ అబద్ధాలంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని.. యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు, తిరుమలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. తనపై మాజీ మంత్రులు రోజా, ఉషశ్రీచరణ్ విమర్శలపై ఆమె స్పందించారు. ‘టీటీడీ లెటర్లు అమ్ముకున్నదెవరో నగరి, కల్యాణదుర్గంలో ఎవరిని అడిగినా చెబుతారు. చెరువులు మాయం చేసి లే అవుట్లు వేసుకున్నదెవరో అందరికీ తెలుసు. మెడికల్ కాలేజీలపై నిజం చెబితే భయమెందుకు’ అని వ్యాఖ్యానించారు.