Minister Savita: వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:40 AM
వైసీపీ ఆరోపిస్తున్న విధంగా తల్లికి వందనం నిధులు మంత్రి లోకేశ్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తా.
జగన్ రాజీనామా చేస్తారా? మంత్రి సవిత సవాల్
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఆరోపిస్తున్న విధంగా తల్లికి వందనం నిధులు మంత్రి లోకేశ్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయగలరా?’ అంటూ మంత్రి ఎస్ సవిత సవాల్ విసిరారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వం లో చిన్నారులకు మేనమామనని చెప్పుకున్న జగన్... ఆ ఐదేళ్లలో బకాయిలు పెట్టి కంసమామగా మారితే... ఆ బకాయిలన్నీ చంద్రబాబు చెల్లి స్తూ, తల్లికి వందనం అమలు చేస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూస్తే ప్రజలే జగన్‌ను అధికారం నుంచి డైవర్ట్ చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు’ అంటూ మంత్రి సవిత ఎద్దేవా చేశారు.