Share News

Minister Savita: రైతు ద్రోహి జగన్‌: మంత్రి సవిత

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:55 AM

ఐదేళ్ల పాలనలో రైతులను గాలికి వదిలేసిన జగన్‌ రైతు ద్రోహి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు.

Minister Savita: రైతు ద్రోహి జగన్‌: మంత్రి సవిత

పెనుకొండ టౌన్‌, జూలై 10(ఆంద్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో రైతులను గాలికి వదిలేసిన జగన్‌ రైతు ద్రోహి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు, భూ చట్టం, నాసిరకం విత్తనాల పంపిణీ, నాసిరకం ఎరువులతో రైతులను జగన్‌ మోసగించారని అన్నారు. సీఎం చంద్రబాబు తోతాపురి మామిడికి కిలో రూ.4 చొప్పున మద్దతు ధర ప్రకటించి, రూ.260 కోట్లు విడుదల చేశారని, త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 04:55 AM