Share News

మహిళలను అవమానిస్తే చర్యలు తప్పవు: సవిత

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:23 AM

మహిళల పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించినా, అవమానపరిచినా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు.

మహిళలను అవమానిస్తే చర్యలు తప్పవు: సవిత

కడప ఎర్రముక్కపల్లె, జూలై 8(ఆంధ్రజ్యోతి): మహిళల పట్ల ఎవరు దురుసుగా ప్రవర్తించినా, అవమానపరిచినా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు. మంగళవారం కడపలో ఎమ్మెల్యే ఆర్‌.మాధవితో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కించపరిచేలా, అసభ్యకరంగా మాట్లాడిన ప్రసన్నకుమార్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌కు మహిళలపట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రసన్నకుమార్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. సొంత తల్లిని, చెల్లిని ఆస్తుల కోసం ఇంటి నుంచి గెంటేయడమే కాకుండా కోర్టుకు ఈడ్చిన ఘనుడు జగన్‌రెడ్డి అన్నారు. ఇంట్లో ఆడవాళ్లను గౌవించని జగన్‌, రాష్ట్రంలో ఇతర మహిళలను ఏం గౌరవిస్తాడని ప్రశ్నించారు. మహిళలను కన్నీరు పెట్టిస్తే రాజకీయంగానే కాకుండా నైతికంగానూ పతనమవ్వడం ఖాయమన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 05:24 AM