BG BREAKING: త్వరలో బిగ్‌బాస్ అరెస్టు!
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:10 AM
మద్యం స్కాంలో త్వరలోనే బిగ్‌బాస్ అరెస్టు అవుతారని మంత్రి సత్యకుమార్ అన్నారు. అరెస్టు భయంతోనే జగన్ ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు.
ధర్మవరం, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): మద్యం స్కాంలో త్వరలోనే బిగ్‌బాస్ అరెస్టు అవుతారని మంత్రి సత్యకుమార్ అన్నారు. అరెస్టు భయంతోనే జగన్ ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పరామర్శకు వెళతారని, కానీ మాజీ సీఎం జగన్ మాత్రం దౌర్జన్యాలు, కబ్జాలు చేసిన వారిని పరామర్శించడానికి వెళుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనవారిని అరెస్టు చేస్తారా అని జగన్ వితండవాదం చేయడం సిగ్గుచేటని అన్నారు. తప్పు చేస్తే ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా చట్టం విడిచిపెట్టదని అన్నారు. ప్రజలు జగన్ మాయ మాటలు నమ్మేస్థితిలో లేరని అన్నారు.