Share News

Minister Satyakumar: జీఎస్టీ 2.0తో ప్రజారోగ్య సంరక్షణకు భరోసా

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:51 AM

దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)-2.0తో ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని...

Minister Satyakumar: జీఎస్టీ 2.0తో ప్రజారోగ్య సంరక్షణకు భరోసా

  • మందుల ధరలు తగ్గుతాయి

  • వ్యాక్సిన్లు, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌, టీబీ గుర్తింపు కిట్ల ధరలు కూడా

  • ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌

అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)-2.0తో ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై ఇప్పటివరకు ఉన్న 18శాతం జీఎస్టీని తొలగించినందున మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. అలాగే, జీఎస్టీ నూతన సంస్కరణల కారణంగా క్యాన్సర్‌, అరుదైన ఇతర వ్యాధుల మందులు, చికిత్సలకు సంబంధించిన పరికరాల ధరలు కూడా తగ్గుతాయని తెలిపారు. వ్యాక్సిన్లు, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌, టీబీ గుర్తింపు కిట్ల ధరలు కూడా దిగివస్తాయన్నారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూ శాసనసభలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగాలు, ఏకగ్రీవ తీర్మానానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ పన్నుల శ్లాబులను తగ్గించాలనే నిర్ణయం సాహసోపేతమైందిగా పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయంత్లో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరట కలుగుతుందని తెలిపారు.

Updated Date - Sep 22 , 2025 | 04:52 AM