బాలికలకు మెరుగైన వైద్య సేవలు: సత్యకుమార్
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:34 AM
పచ్చకామెర్లతో అస్వస్థతకు గురైన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
మహారాణిపేట(విశాఖపట్నం), పార్వతీపురం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పచ్చకామెర్లతో అస్వస్థతకు గురైన కురుపాం గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారించేందుకు ఇప్పటికే అధికారుల బృందం కురుపాం చేరుకుందని, నివేదిక మేరకు బాధ్యులపై చర్యలు ఉంటాయని చెప్పారు. కాగా, గురుకుల విద్యాలయాల్లో ఐటీడీఏ పీవో లేదా డీడీ స్థాయి అఽధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేస్తామని గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అన్నారు.గురుకుల విద్యాలయాలతో పాటు ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.