Minister Satya kumar: వైద్య కళాశాలలపై దిగజారుడు రాజకీయాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:44 AM
కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సగం సీట్లకు రూ.12 లక్షలు, రూ.20 లక్షలు ఫీజులు నిర్ణయించిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు వైద్య విద్యార్థుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని...
కోటి సంతకాలు తాడేపల్లి ప్యాలె్‌సలో పెట్టారా?
జగన్‌ను నిలదీసిన మంత్రి సత్యకుమార్
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సగం సీట్లకు రూ.12 లక్షలు, రూ.20 లక్షలు ఫీజులు నిర్ణయించిన మాజీ సీఎం జగన్ ఇప్పుడు వైద్య విద్యార్థుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం ఆరోపించారు. కల్తీ మద్యం, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ, భారీ అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జగన్ తన రాజకీయ ఉనికి కోసం పీపీపీ వైద్య కళాశాలలపై దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానాన్ని ప్రయివేటీకరణగా చిత్రీకరిస్తూ కోటి సంతకాలంటూ నానా యాగీ చేస్తున్న జగన్‌కు ప్రజల మద్దతు లేకపోవడంతో తాడేపల్లి ప్యాలె్‌సలో ఎన్ని దొంగ సంతకాలు చేశారో చెప్పాలని మంత్రి నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ కొత్త ప్రభుత్వ కాలేజీల్లో రూ.12 లక్షలు, రూ.20 లక్షల ఫీజులు ఎందుకు నిర్ణయించారో చెప్పాలని నిలదీశారు.