Minister Satya kumar: సురక్షిత ప్రాంతాలకు 787 మంది గర్భిణులు
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:08 AM
మొంథా తుఫాన్ పరిస్థితుల ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రసవానికి వారం రోజుల వ్యవధి కలిగిన సుమారు 787 మంది గర్భిణులను...
17 జిల్లాల్లోని ఆస్పత్రుల్లో 551 షెల్టర్లు: మంత్రి సత్యకుమార్
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ పరిస్థితుల ను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రసవానికి వారం రోజుల వ్యవధి కలిగిన సుమారు 787 మంది గర్భిణులను సమీప ఆసుపత్రులకు తరలించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. 17 జిల్లా ల్లో మెడికల్ ఆఫీసర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వర కూ 551 షెల్టర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే తుఫాను సహాయక విధుల్లో పాల్గొనే వారి హాజరును నిశితంగా పరిశీలిస్తున్నామని, జిల్లాలకు పంపిన ప్రామాణిక విధి విధానాలకు అనుగుణంగా అధికారులు, వైద్యులు, సిబ్బంది వ్యవహరించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సృష్టం చేశారు.