Share News

Minister Parthasarathy: అంతా విధ్వంసమే

ABN , Publish Date - Nov 08 , 2025 | 06:17 AM

వైసీపీ ఐదేళ్ల పాలనలో దోపిడీ, విధ్వంసం తప్ప ఏమన్నా ఉందా అందులో నుంచి మేము క్రెడిట్‌ చోరీ చేయాలా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.

Minister Parthasarathy: అంతా విధ్వంసమే

  • క్రెడిట్‌ చోరీ చేయడానికేముంది?: మంత్రి పార్థసారథి

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో దోపిడీ, విధ్వంసం తప్ప ఏమన్నా ఉందా? అందులో నుంచి మేము క్రెడిట్‌ చోరీ చేయాలా?’ అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొంథా తుఫాను సమయంలో అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సత్వర స్పందన చూపిందని అన్నారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేయబట్టే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిందన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 06:18 AM