బుడమేరు మళ్లింపు కాలువపై నిఘా పెట్టండి: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:56 AM
తుఫాను ప్రభావిత జిల్లాల్లోని జల వనరుల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
ఇంటర్నెట్ డెస్క్: తుఫాను ప్రభావిత జిల్లాల్లోని జల వనరుల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కాడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులతో కలసి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలి. ఎన్‌టీఆర్ జిల్లాలో వర్షపాతాన్ని బట్టి బుడమేరు డైవర్షన్ చానల్‌పై నిఘా ఉంచాలి’ అని ఆదేశించారు.