Share News

Minister Nimmala: మంత్రిగారి కూలి పని...!

ABN , Publish Date - Nov 10 , 2025 | 04:41 AM

నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకమై.. శ్రమదాన కార్యక్రమాల్లో ముందుండే జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి...

Minister Nimmala: మంత్రిగారి కూలి పని...!

  • కార్మికులతో కలిసి మంత్రి నిమ్మల శ్రమదానం

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకమై.. శ్రమదాన కార్యక్రమాల్లో ముందుండే జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తనదైన శైలిలో శ్రమదానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గౌడ, శెట్టిబలిజ (బీసీ) కల్యాణ మండపం నిర్మాణంలో భాగంగా ఆదివారం చేపట్టిన శ్లాబ్‌ నిర్మాణ పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ కార్మికులతో కలిసి ఇసుక, కంకర గమేళాను నెత్తిన పెట్టుకుని కాంక్రీట్‌ మిల్లర్‌లో వేశారు. భవన నిర్మాణానికి గత టీడీపీ హయాంలో రూ.1.50కోట్లు మంజూరు కావడంతో మొదటి అంతస్థుకు శ్లాబ్‌ వేశామని, అనంతరం వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మంత్రి తెలిపారు. మళ్లీ ఇప్పుడు కూటమి నిధులు మంజూరు చేయడంతో కల్యాణ మండప నిర్మాణాన్ని పూర్తి చేయనున్నామన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 04:41 AM