Share News

గ్రామాల ఆదాయం గ్రామాభివృద్ధికే: మంత్రి నారాయణ

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:45 AM

గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటి అభివృద్ధికే ఖర్చుపెట్టాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా...

గ్రామాల ఆదాయం గ్రామాభివృద్ధికే: మంత్రి నారాయణ

తిరుపతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటి అభివృద్ధికే ఖర్చుపెట్టాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, పట్టణాభివృద్ధి సంస్థలకు ఆ దిశగా ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి తరువాత తిరుపతి నగరపాలక సంస్థ, తుడా అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వం ప్రజావసరాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. పోతూపోతూ పది లక్షల కోట్ల అప్పు, 85 లక్షల టన్నుల చెత్త మిగిల్చి వెళ్లారు. చెత్త నిల్వల వలన ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఎన్జీటీ, సుప్రీం కోర్టు అక్షింతలు వేసినప్పటికీ గత ప్రభుత్వానికి చలనం రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్తను అక్టోబరు 2వ తేదీలోపు తొలగించాలని ఆదేశించారు. ఇప్పటికే 73 లక్షల టన్నుల చెత్త తొలగించాం. అదే విధంగా రాష్ట్రంలోని ఆరు కేంద్రాల్లో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నాం.’ అని చెప్పారు.

Updated Date - Aug 26 , 2025 | 06:45 AM